ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (13:49 IST)

బాలింత భార్యను హత్య చేసిన భర్త.. మెడపై గోళ్ల గుర్తులు.. అలా అరెస్ట్?

woman
హైదరాబాద్, సైదాబాదులో తన కోరిక తీర్చడం లేదని నెలరోజుల బాలింత అయిన భార్యను భర్త హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పోస్టుమార్టం రిపోర్టులో ఈ విషయం వెల్లడి అయ్యింది. నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు. 
 
ప్రసవించి ఒక నెలే అవుతున్నా.. శృంగారం కోసం భార్య ఝాన్సీని తరుణ్ బలవంతం చేశాడు. ఒప్పుకోకపోవడంతో తలను అదిమి పట్టాడు. దీంతో ఊపిరాడక ఆమె మరణించింది. 
 
ఈ వ్యవహారం పోస్టు మార్టం రిపోర్టులో వెల్లడి అయ్యింది. ఝాన్సీ తండ్రి నెనావత్ రేఖ్యా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మృతురాలి భర్త తరుణ్‌‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
దీంతో ప్రేమించి పెళ్లి చేసుకుని భర్త కడతేర్చాడు. మృతురాలి మెడపై గోళ్ల గుర్తులు ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్టులో నిర్ధారణ అయ్యింది. పోలీసులు తమదైన శైలిలో తరుణ్‌ను విచారించగా.. తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.