యువకుడు బండి నడుపుతుంటే వెనుక కూర్చొన్న యువకుడు గొంతుకోశాడు.. ఎక్కడ?

సోమవారం, 7 జూన్ 2021 (11:34 IST)
హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో ఓ యువకుడి మరో యువకుడి గొంతు కోశాడు. వెనుక కూర్చొని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది.
 
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాఫానగర్‌లో నివసించే మహ్మద్‌ అబ్దుల్‌ షారుఖ్‌(24)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆటో నడుపుతుంటాడు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో స్నేహితుడితో కలిసి యాక్టివా (టీఎస్‌ 12 ఈఈ 3501)పై బయటకు వెళ్లాడు. 
 
అయితే… జహనుమా రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుండగా బండి నడుపుతున్న పారుఖ్‌ను వెనకకూర్చున్న వ్యక్తి గొంతుకోశాడు.. కిందపడిన ఫరూఖ్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి సత్తార్‌ హోటల్‌ ముందు పడి మృతి చెందాడు. 
 
స్థానికుల సమాచారం మేరకు ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మజీద్‌, ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర, ఎస్సై వెంకటేశ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అన్నీ చూడండి

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments