బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య.. నాలుగో అంతస్థు నుంచి?
బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లిఖిత హాస్టల్ నాలుగో అంతస్థు పైనుంచి దూకేసింది.
బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతోంది.