సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 13 మే 2020 (09:15 IST)

సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా: కేటీఆర్‌

తన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారం గురించి మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘‘నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను’’ అని స్పష్టం చేశారు.

‘కరోనా కట్టడి కోసం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. మా ఆరోగ్యం కాదు.. మీ ఆరోగ్యం గురించీ కాస్త పట్టించుకోండి. విశ్రాంతి తీసుకోండి’ అని ట్విటర్‌ వేదికగా పలువురు నెటిజన్లు కోరారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

సోమవారం సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్నప్పుడు జలుబుకు సంబంధించిన అలర్జీ వచ్చిందని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా  తనకు ఆ అలర్జీ ఉందన్నారు.

అప్పటికే తన సిరిసిల్ల పర్యటనకు సంబంధించిన కార్యక్రమం అంతా సిద్ధమైందని, తాను వెళ్లకపోతే చాలా మందికి ఇబ్బంది కలిగేదని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే తన పర్యటనను రద్దు చేసుకోకుండా సిరిసిల్లకు వెళ్లాల్సివచ్చిందని ఆయన తెలిపారు.