Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్‌సైట్‌లో ఇంటర్ హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్

Written By ఠాగూర్
Updated: బుధవారం, 4 మే 2022 (12:12 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఆరో తేదీ నుంచి 24వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యే విద్యార్థులు తమ హాల్‌టిక్కెట్లను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆ రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. www.tsbie.gov.in అనే వెబ్‌సైట్‌లో డౌన్‌లోడు చేసుకోవచ్చని తెలిపారు. 
 
హాల్ టిక్కెట్లపై ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినప్పటికీ పరీక్ష రాయొచ్చని తెలిపారు. అదేసమయంలో హాల్‌టిక్కెట్లలో ఏదేని తప్పులు దొర్లివున్నట్టయితే ప్రిన్సిపాల్స్ లేదా జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవాలని విద్యార్థుకు ఆయన సూచించారు. పరీక్షా కేంద్రం కోడ్ నంబరు, అది ఉన్న ప్రాంతాన్ని ఒక రోజు ముందుగా చూసుకుని రాయాలని కోరారు. 
 
మరోవైపు, ట్యూషన్ ఫీజులు చెల్లిస్తేనే హాల్ టిక్కెట్లు ఇస్తామంటూ కొన్ని ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు చేస్తున్న హెచ్చరికలపై ఇంటర్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్యూషన్ ఫీజు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేసినందుకుగాను రెండు కాలేజీలకు షోకాజ్ నోటీసులు పంపించింది. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments