Daily Horoscope
✕

రాసలీలల బాగోతం.. బీజేపీ కరీంనగర్‌ అధ్యక్షుడిపై అధిష్టానం వేటు

Written By సెల్వి
Updated: శుక్రవారం, 2 అక్టోబరు 2020 (16:26 IST)
ఓ మహిళా కార్యకర్తతో రాసలీలల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో బీజేపీ కరీంనగర్‌ అధ్యక్షుడు బాస సత్యనారాయణపై అధిష్టానం వేటు వేసింది.  సత్యనారాయణ తీరుపై అధిష్టానం తీవ్రంగా మండిపడింది. 
 
స్థానిక ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెంటనే సత్యనారాయణను పదవి నుంచి తొలగించారు. బాధ్యత గల పదవిలో ఉండి మహిళా కార్యకర్తతో ఇలా వ్యవహరించడం పార్టీతో పాటు ఆయన వ్యక్తిత్వానికి సరైంది కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 
 
నూతన అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డిని నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. కాగా బాస సత్యనారాయణ ఓ మహిళతో అసభ్యకర రీతిలో మాట్లాడుతున్న ఓ ఆడియో ఇటీవల సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

అన్నీ చూడండి

Nayanatara: మహాశక్తి సినిమా కోసం ప్రమోషన్ చేస్తూ దైవిక ఆశీస్సులు కోరుతున్న నయనతార

డాక్టర్ డూమ్ హవా - అవెంజర్స్: డూమ్స్‌డే నుంచి 5 కొత్త పోస్టర్లు విడుదల

Pocket Rockets trailer : ఇద్దరు స్నేహితులు జూదం తో తలరాతను మార్చుకున్నారా? పాకెట్ రాకెట్స్ ట్రైలర్

Ravi Dubey: రవీ దుబే లక్ష్మణుడి పోస్టర్ రామాయణం పై అంచనాలను పెంచుతోంది

Vishwak Sen: ఆడియన్స్ కు పిచ్చెక్కించే లవ్ స్టోరీ కథగా ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్‌ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments