సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (22:19 IST)

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనావైరస్, హోంక్వారెంటైన్లో...

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ రోజు ఉదయం సాధారణ COVID-19 పరీక్ష చేయగా రిపోర్టులో భారత ఉపరాష్ట్రపతికి కరోనావైరస్ పాజిటివ్‌ వచ్చింది. అయినప్పటికీ, ఆయన ఎంతో హుషారుగా వున్నారు. చాలా తక్కువ లక్షణాలు వుండటంతో హోం క్వారెంటైన్లో వుండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.
 
మరోవైపు ఉపరాష్ట్రపతి సతీమణి శ్రీమతి ఉషా నాయుడుకి కరోనావైరస్ నెగటివ్ వచ్చింది. ఇటీవలి కాలంలో పలువురు రాజకీయవేత్తలకు కరోనావైరస్ సోకుతూ ఆందోళన కలిగిస్తోంది.