మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: శుక్రవారం, 3 ఆగస్టు 2018 (22:06 IST)

ప్రధానమంత్రి మోడీతో భేటీ కానున్న కేసీఆర్...

తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడితో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని ప్రధానమంత్రికి చెప్పనున్నారు. హైకోర్టు విభజన అంశంపై కూడా ప్రధాన మంత్రితో

తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడితో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని ప్రధానమంత్రికి చెప్పనున్నారు. హైకోర్టు విభజన అంశంపై కూడా ప్రధాన మంత్రితో చర్చించనున్నట్టు సమాచారం. 
 
వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధుల సమకూర్చడం, సెక్రేటేరియట్ నిర్మాణానికి రక్షణ శాఖ స్థలం కేటాయించడం, రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యంగ సవరణ చేయడం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదల, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు తదితర అంశాలపై ప్రధానమంత్రితో చర్చించనున్నారు.