మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 13 డిశెంబరు 2018 (18:40 IST)

గవర్నర్ దంపతులతో సీఎం కేసీఆర్ కుటుంబం(ఫోటోలు)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో ఆయన చేత రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. రాష్ట్ర మంత్రిగా మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్ అలీ ప్రమాణం చేశారు. 
 
ప్రమాణస్వీకారం అనంతరం సభికులకు సీఎం కేసీఆర్ వినమ్రంగా నమస్కారం చేశారు. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్.. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
 
అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులు గవర్నర్ దంపతులతో ఫోటోలు దిగారు.