Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ భవనంలా కేసీఆర్‌ బడి

Written By ఎం
Updated: శనివారం, 3 జులై 2021 (10:19 IST)
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తాను చదువుకున్న బడిని రాజ భవనంలా తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. పాఠశాల నుంచి జూనియర్‌ కాలేజీ వరకు ఒకేచోట ఉండేలా నిర్మించారు. దుబ్బాక పాఠశాలలో కేసీఆర్‌ ప్రాథమిక విద్య నుంచి 9వ తరగతి దాకా చదివారు.

సీఎం అయిన తర్వాత నూతన భవన నిర్మాణానికి తొలుత రూ.6 కోట్లు కేటాయించారు. తర్వాత నిధులను పెంచారు. ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల ఒకేచోట ఉండాలనే సంకల్పంతో 18,787 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తులతో నిర్మించారు. పాఠశాల కోసం 14 తరగతి గదులు, నాలుగు ప్రయోగశాలలు, ఒక ఆర్ట్స్‌ గది, కామన్‌ గది, ఒక స్టోర్‌ రూం, ప్రధానోపాధ్యాయుడి గది, మూడు సిబ్బంది గదులు ఉన్నాయి.
 
జూనియర్‌ కళాశాల కోసం 14 తరగతి గదులు, నాలుగు ల్యాబ్‌లు, స్పోర్ట్స్‌ రూం, గ్రంథాలయం, కంప్యూటర్‌ ల్యాబ్‌, ప్రిన్సిపాల్‌ గది, రెండు సిబ్బంది గదులు, ఒక సమావేశ మందిరం ఉన్నాయి. 250 మంది ఒకేసారి వినియోగించుకునేలా బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించారు.

పాఠశాల, కళాశాలలకు విడివిడిగా నీటి ట్యాంకులున్నాయి. ప్రత్యేక విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలున్నాయి. 

అన్నీ చూడండి

Kaala Bhairava: కావ్య కళ్యాణ్‌రామ్, కాల భైరవ ఇస్టపడ్డారు త్వరలో పెండ్లి

అన్ని అంశాలతో మ్యూజికల్ డ్రామా గా జగమే సంగీతం : పల్నాటి సూర్య ప్రతాప్

Nagababu: నాగబాబు, కేఎస్ రవి కుమార్ అతిథులుగా వేట చిత్రం ప్రారంభం

Sree Vishnu: ప్రతి యువకుడి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే కథ గా శ్రీ విష్ణు చిత్రం

గుడ్ టైం మూవీ తో అందరికీ గుడ్ టైం రాబోతుందన్న ప్రముఖులు

తర్వాతి కథనం
Show comments