ఖైరతాబాద్ గణేషుడు ఈసారి 27 అడుగులే
కరోనా కారణంగా ఈ సారి 27 అడుగులకే ఖైరతాబాద్ గణేషుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. 27 అడుగులే కనుక పూర్తి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్ గణేష్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
27 అడుగులతో ధన్వంతరి వినాయకుడిని ఏర్పాటు చేయనుంది ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీ. భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలు ఏర్పాటు చేస్తామంటున్నారు నిర్వాహకులు.
అలాగే ఆన్లైన్ ద్వారా కూడా దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖైరతాబాద్ గణేష్ కమిటీ నిర్వాహకులు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో, అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో చాలామంది ప్రజలు ఈ వైరస్ భయంతో నగరం నుండి పల్లెలకు తరలిపోతున్నారు.