కేసీఆర్ కేబినెట్‌లో కేటీఆర్‌కు నో ఛాన్స్.. నంబర్ 2గా హరీష్

Updated: శనివారం, 15 డిశెంబరు 2018 (09:50 IST)
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కేటీఆర్‌కు ప్రమోషన్ కల్పించారు.
 
ఇటీవలి ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించడం.. ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన కేటీఆర్‌కు వర్కింగ్ ప్రమోషన్ దక్కడంతో.. కాబోయే సీఎం ఆయనే అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త మంత్రివర్గంలో ఆయనకు స్థానం ఉండకపోవచ్చునన్న ప్రచారం కూడా జోరందుకుంది.
 
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, క్షేత్రస్థాయిలో కేడర్ బలోపేతంపైనే కేటీఆర్ ఫోకస్ చేయనున్నారు. వచ్చే ఐదారు నెలల పాటు ఆయన ఈ పనులతోనే బిజీగా ఉండనున్నారు. 
 
కాబట్టి మంత్రివర్గంలోకి కేటీఆర్‌ను తీసుకుంటే పార్టీ పనులపై ఫోకస్ చేయడం కష్టమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నాటికి కేటీఆర్‌ను సీఎం చేసి.. కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తారన్న వాదన వినిపిస్తోంది. 
 
అంతేకాదు, ఈసారి డిప్యూటీ సీఎం పదవిని మహమూద్ అలీకే పరిమితం చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే పార్టీకి తొలి నుంచి వీర విధేయులుగా ఉన్నవారికే ఈసారి మంత్రివర్గంలో చోటుదక్కుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments