Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారెక్కిన ఎల్.రమణ : సాదరంగా ఆహ్వానించిన మంత్రి కేటీఆర్

Written By ఠాగూర్
Updated: సోమవారం, 12 జులై 2021 (12:18 IST)
తెలంగాణ టీడీపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ మారిపోయారు. ఆయన సోమవారం కారెక్కారు. టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మ‌క్షంలో ర‌మ‌ణ గులాబి గూటికి చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా ర‌మ‌ణ‌కు గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి కేటీఆర్ సాద‌రంగా ఆహ్వానించారు. కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ ర‌మ‌ణ‌.. టీఆర్ఎస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ర‌మ‌ణ‌కు కేటీఆర్‌తో పాటు ప‌లువురు నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
అలాగే ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారు. రమణతోపాటు మరికొందరు టీఆర్ఎస్‌లో చేరనున్నారు. 
 
కాగా, రమణ టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తొలుత ఈ వార్తలను ఖండించిన ఆయన గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. తన ఎదుగుదలకు 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు అందులో హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

అన్నీ చూడండి

ప్రభాస్ చిత్రం పౌర్ణమిలోని తెలుగు పాటకు చైనీస్ నర్తకి నాట్యం ట్రెండింగ్ వీడియో

మమ్ముట్టి మూవీ ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ నుంచి వీడియో గ్లింప్స్

Fauzi Update: పోస్ట్‌ప్రొడక్షన్‌తో ఫౌజీ స్పీడ్.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ?

Sumanth: పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది : సుమంత్

Anaswara Rajan look: కాకా చిత్రానికి అనస్వర రాజన్ హృదయం అని కితాబు

తర్వాతి కథనం
Show comments