దారుణం, మహిళను కత్తులతో పొడిచి చంపుతుంటే వీడియోలు తీస్తూ చోద్యం చూశారు

murder
ఐవీఆర్| Last Modified బుధవారం, 8 జులై 2020 (14:37 IST)
తెలంగాణలోని వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారంలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే కొందరు వ్యక్తులు ఓ మహిళపై కత్తులతో దాడి చేస్తూ పొడిచేశారు. ఈ ఘటనను అడ్డుకోవాల్సిందిపోయి అక్కడే వున్న కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీసారు.

వివరాల్లోకి వెళితే, బుద్దారంలోని రెండు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా భూవివాదం నడుస్తూ వుంది. భూమి విషయమై ఈరోజు మరోసారి గొడవపడి మాటామాట పెరిగింది. దీనితో అనంతరావుతో పాటు ఆమె భార్య రత్నమ్మపై అర్జున్‌రావు, శేషమ్మ అనే వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రత్నమ్మ పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం గాయపడినవారిని హైదరాబాద్‌కు‌ తరలించారు. కాగా ఈ దారుణానికి పాల్పడ్డవారిని పోలీసులు అరెస్టు చేశారు.దీనిపై మరింత చదవండి :