గొడవ వచ్చిందని జెసిబితో దాడి చేశాడు, అక్కడికక్కడే కుప్పకూలి..!

JCB
జె| Last Modified మంగళవారం, 7 జులై 2020 (18:04 IST)
వరంగల్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తనను అకారణంగా తిట్టాడని జెసిబితో దాడి చేశాడు డ్రైవర్. దీంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు బాధితుడు. వరంగల్ జిల్లా మంగంపేట మండలం కమలాపూర్ గ్రామంలో ఘటన చోటు చేసుకుంది.

రాఘవయ్య స్థానిక రైతు. తన పొలం పక్కనే ఉన్న మరో వ్యక్తి స్థలంలో జెసిబితో వ్యక్తి పనిచేస్తున్నాడు. అయితే తన పొలానికి కట్టిన కంచెను నాశనం చేస్తున్నాడని.. జెసిబి పనుల కారణంగా తన పొలానికి కట్టిన కంచెం నాశనమైపోతోందని రాఘవయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు.

జెసిబి డ్రైవర్‌ను దుర్భాషలాడాడు. దీంతో జెసిబి డ్రైవర్ జెసిబితో పాటు రాఘవయ్యపై దాడి చేశాడు. జెసిబికి ముందు ఉన్న ప్రొక్లెయిన్ లాంటి పరికరంతో రాఘవయ్య తలపై బాదాడు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గ్రామస్తులు వచ్చేలోపే జెసిబి డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నాడు.
దీనిపై మరింత చదవండి :