Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

నిజామాబాద్ జిల్లాలో ఒకే కొమ్మకు ఉరేసుకున్న ప్రేమజంట

Written By ఠాగూర్
Updated: గురువారం, 10 జూన్ 2021 (17:13 IST)
నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రేమ జంట చెట్టు ఒకే కొమ్మకు ఉరేసుకున్నారు. ఎంతోకాలంగా ప్రేమించుకుంటూ వచ్చిన ఈ జంట.. ఏం కష్టమొచ్చిందో ఏమోగానీ... ప్రేమికులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఓ యువతీ యువకుడి మృతదేహాలు వేలాడుతుండటాన్ని స్థానికులు గుర్తించారు. వారిద్దరూ ఒకే కొమ్మకు ఉరేసుకుని వుండటం చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. 
 
వెంటనే పోలీసులు స్థానికులతో కలిసివచ్చి చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను కిందికి దించారు. ఆ తర్వా పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఈ ప్రేమ జంట వివరాలు తెలిశాయి. 
 
ఈ మృతులను మోస్రా మండలం తిమ్మాపూర్‌కు చెందిన మోహన్, లక్ష్మిలుగా గుర్తించారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడివుంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, వీరిద్దరూ వారం రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments