గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 మే 2021 (11:03 IST)

మహబూబ్ నగర్‌లో కుటుంబం బలి.. తెలంగాణలో కేసులెన్ని..?

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలోని నెల్లికుదురులో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కరోనా బలి తీసుకుంది. 11 రోజుల వ్యవధిలోనే ఇద్దరు భార్యాభర్తలు, వారి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 2వ తేదీన తండ్రి, 4న పెద్ద కుమారుడు, 11న చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోగా, ఇవాళ తల్లి మృతి చెందింది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి(60) తుదిశ్వాస విడిచింది. మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
 
తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దాంతో రోజూ వారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,525 శాంపిల్స్ పరీక్షించగా.. వీరిలో 4,723 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇదే సమయంలో రికవరీలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా 5,695 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా ప్రభావంతో రాష్ట్రంలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.