మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 మే 2021 (22:24 IST)

కోవిడ్ విజేతల్లో బ్లాక్ ఫంగస్.. డ్రగ్ లభ్యతపై కేంద్రం దృష్టి

Black fungus
కోవిడ్ విజేతల్లో కొందరిపై దాడి చేస్తున్న బ్లాక్ ఫంగస్ మీద భారత ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. దేశంలో పలు చోట్ల (మ్యూకోర్‌మైకోసిస్) బ్లాక్ ఫంగస్ కేసులు నమోదువుతున్న నేపథ్యంలో ఈ కొత్త మహమ్మారిని ఎదుర్కొనే 'ఆంఫోటెరిసిన్-బీ' డ్రగ్ లభ్యతను పెంచే ప్రయత్నం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం.
 
దేశీయంగా ఈ డ్రగ్ ఉత్పత్తి పెంచడంతో పాటు, దిగుమతులు చేసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. బ్లాక్ ఫంగస్‌ను ఎదుర్కొనేందుకు వైద్యులు 'ఆంఫోటెరిసిన్-బీ' అనే మందును సూచిస్తుండటంతో మార్కెట్లో ఈ డ్రగ్ కొరత ఏర్పడకుండా ముందు నుంచీ చర్యలు ముమ్మరం చేస్తున్నది. ఈ మేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీకి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది.
 
ఇలా ఉండగా, మహారాష్ట్ర, గుజరాత్​ తదితర రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్​ ఫంగస్ ఇన్​ఫెక్షన్​ సోకుతుండటం ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే.