Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతానం కలగలేదు.. కోపంతో భార్యపై గొడ్డలితో దాడి..

Written By సెల్వి
Updated: ఆదివారం, 17 జనవరి 2021 (10:51 IST)
నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహావీర్ తండా గ్రామంలో దారుణం జరిగింది. సంతానం కలగలేదన్న కోపంతో భార్యపై గొడ్డలితో దాడి చేశాడు కసాయి భర్త. బాధితురాలి తల వెనుకభాగంలో బలమైన గాయాలయ్యాయి. 
 
సమాచారం అందుకున్న ఆమె తండ్రి హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహావీర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గనగర్కు చెందిన చౌహన్ బండుతో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం బిర్లాగొంది గ్రామానికి చెందిన చౌహన్ విజయకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. 
 
కొన్నేళ్లు సంసారం సాఫీగానే సాగింది. పిల్లలు కాలేదన్న సాకుతో రెండో పెళ్లి చేసుకుంటానని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యపై గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాం నరసింహరెడ్డి వెల్లడించారు.

అన్నీ చూడండి

Prakash Raj: డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ సినిమా ఫాదర్ టీజర్ రిలీజ్

king 100: నాగార్జున పుట్టినరోజు న కింగ్ 100 మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Mandadi teaser: విజువల్స్, బోట్ సీక్వెన్స్ తో సుహాస్, సూరి ల మండాడి టీజర్

Taapsee Pannu : అప్పుడే మేము దానిని వేడుకలా జరుపుకుంటాం : తాప్సీ పన్ను

ప్రియదర్శి.. ఇడుపు కాయితం నుంచి శ్రీలత సాంగ్ ప్రోమో రిలీజ్

తర్వాతి కథనం
Show comments