గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (10:54 IST)

షేక్ పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ నగరం షేక్ పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు.
 
శుక్రవారం రాత్రం షేక్ పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జిపై ఓ బైక్‌ను వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న యువకుడు బ్రిడ్జి పైనుంచి కిందపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
 
మరణించిన యువకుడిని కర్నూల్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రీతమ్ భరద్వాజ్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.