శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (13:28 IST)

మలుగులో మావోయిస్టుల పోస్టర్లు కలకలం... ఇన్ఫార్మర్లకు వార్నింగ్

తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో ఆంధ్రా, ఒరిసా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పెరగడంతో పోలీసుల గస్తీ కూడా పెంచారు. అలాగే భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశాయి.
 
ఈ నేపథ్యంలో మలుగు జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. గురువారం వెంకటాపురం మండలి, కొండాపూర్ - ఆలుబాక గ్రామాల మధ్య మావోల పోస్టర్లు వెలిశాయి. ఇవి వెంకటాపురం - వాజేడు ఏరియా కమిటీ పేరుతో ముద్రించారు. అలాగే, కొన్ని లేఖలను కూడా స్థానికులు గుర్తించారు. ముఖ్యంగా, పోలీసులకు తమ గురించి సమాచారం అందించే వారిని హెచ్చరిస్తూ ఈ పోస్టర్లను ముద్రించి అంటించారు. 
 
బొల్లారం, సీతారాంపురం, కలిపాక గ్రామాలకు చెందిన కొంతమంది పేర్లను అందులో పేర్కొంటూ, వీరంతా పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ వారు హెచ్చరించారు. ఈ పోస్టర్లు ఇపుడు జిల్లాలో కలకలం రేపుతున్నాయి.