Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింత చెట్టు కింద కుళ్లిన శవం ఎక్కడ?

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 27 ఆగస్టు 2021 (15:15 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. కుటుంబ సమస్యల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని శవం చింత చెట్టు కింద కుళ్లిపోయిన స్థితిలో కనిపించడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ మున్సిపల్ అతివేల్లి గ్రామానికి చెందిన గడ్డం ప్రకాష్ ఈ నెల 1వ తేదీ నుంచి కనిపించలేదు. ఇదే విషయంపై ఆయన భార్య ఈనెల 6వ తేదీన మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదేసమయంలో కుటుంబ సభ్యులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా, ఆయన శవం చింత చెట్టు కింద కనపడింది. 
 
కాగా శుక్రవారం అతివేల్లి లోని ఓ సిమెంట్ పైపులు తయారీ కంపెనీ సమీపంలోని చింతచెట్టు కింద పడిపోయింది. అక్కడి వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు అని స్థానికులు తెలిపారు. పోలీసులు సదరు మృతదేహం తప్పిపోయిన గడ్డం ప్రకాష్‌గా గుర్తించారు. 
 
వ్యక్తిగత సమస్యల కారణంగా ఆయనే చెట్టుకు ఊరివేసుకొని ఉంటాడని... మృతిదేహం 10 రోజులపైగా కుళ్లి పోయి చెట్టు కింద పడిపోయిందని పోలీసులు వెల్లడించారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments