Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదినిమిషాల కార్యక్రమంలో మంత్రి కేటీఆర్

Written By ఎం
Updated: ఆదివారం, 24 మే 2020 (23:21 IST)
సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పురపాలక శాఖ చేపట్టిన 'ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమము'లో ఈరోజు మంత్రి కేటీ రామారావు తన ఇంటిలో భాగస్వాములయ్యారు.

ఇందులో భాగంగా ఇంటితోపాటు, ఇంటి పరిసరాల్లో పేరుకుపోయిన నీటి పరిశీలన తో పాటు, పూల కుండిలతో పాటు, వివిధ పాత్రల్లో నిండిన నీటిని శుభ్రపరచారు.

దీంతోపాటు ప్రగతిభవన్లో ని గార్డెన్ వంటి ఏరియాల్లో ఎక్కడైనా వాననీరు పేరుకుపోయినడెమనని పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిరంతరం  పది వారాల పాటు కొనసాగించాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు.

ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు ఇంటి శుభ్రత కోసం సమయం కేటాయిస్తే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టడానికి వీలవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీజనల్ వ్యాధుల ను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా కలిసి రావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు.

పురపాలక శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క పౌరుడు వారానికి పది నిమిషాలపాటు ఆదివారం రోజు కేటాయించి పరిసరాల పరిశుభ్రత పైన ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

అన్నీ చూడండి

Udayabhanu: పంచనామాకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా : ఉదయభాను ఎమోషనల్

అదే హుందాతనం, శైలితో గతాన్ని తలచుకుంటూ జనవరి 12 విడుదల

Anupama Parameswaran,: క్రేజీ కల్యాణం నుంచి 'కాకా ధూమ్ ధమాకా సాంగ్ ప్రోమో

Haiku : ఏగన్, శ్రీదేవి.. రొమాన్స్, కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న హైకూ టీజర్

Rashmika: విజయ్ దేవరకొండ నట విశ్వరూపం చూపించిన రణబాలి టీజర్

తర్వాతి కథనం
Show comments