Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొడగొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ చేసిన మంత్రి మల్లారెడ్డి

Written By సెల్వి
Updated: బుధవారం, 25 ఆగస్టు 2021 (19:47 IST)
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక దొంగ, బట్టెబాజ్ అని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి లుచ్చా, లోఫర్ మాటలు మాట్లాడుతున్నాడని… ఆయన ఒక బ్రోకర్ అని నిప్పులు చెరిగారు. 
 
పీసీసీ కూడా అలాగే తెచ్చుకున్నాడని ఆరోపించారు. మూడు చింతల పల్లి కేసీఆర్ దత్తత గ్రామమని..సీఎం కేసీఆర్ ఆ గ్రామాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు.
 
మూడు చింతలపల్లి మండలం మొత్తం టీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలే ఉన్నారని పేర్కొన్నారు. ఆ గ్రామాన్ని అన్ని రకాలుగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశాడన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు దీక్ష చేసాడో తెలియదని మండిపడ్డారు. 
 
అనేక మందికి మంచినీళ్లు, పెన్షన్లు వస్తున్నాయని …ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తున్నాడని లబ్ది పొందిన వాళ్ళు ఫ్లెక్సీలు, ప్లే కార్డ్స్ పెట్టి నిరసన తెలిపారని స్పష్టం చేశారు. అందుకు నన్ను అడ్డుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి అంటున్నాడని చురకలు అంటించారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వం పథకాలు లేని ఇల్లు లేదని…మిగితా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అమలు చేయలేదన్నారు.
 
ఈ సందర్భంగా తొడగొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు మంత్రి మల్లారెడ్డి. తాను కష్టపడి భూమి సంపాదించుకున్నానని.. దమ్ముంటే తన అవినీతిని నిరూపించాలని సవాల్ విసిరారు. ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దామని... నువ్వు ఓకే అంటే రేపే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మల్లారెడ్డి అన్నారు. రేవంత్ దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ విసిరారు. రేవంత్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments