Webdunia - Bharat's app for daily news and videos

Install App

''కవితక్క'' పచ్చబొట్టు.. తెరాస శ్రేణుల్లో ఇదే హాట్ టాపిక్.. పాట కూడా (video)

Written By సెల్వి
Updated: శనివారం, 13 మార్చి 2021 (16:24 IST)
Kavitha
ఎమ్మెల్సీ కవితపై వీరాభిమానంతో ఆమె పేరును చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు నిజామాబాద్‌కు చెందిన చిన్నూ గౌడ్‌. తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులలో ఇదే ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారాడు.

వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌కు చెందిన చిన్నూ గౌడ్‌కు టీఆర్ఎస్ పార్టీ అన్నా, ఎమ్మెల్సీ కవిత అన్నా ఎంతో అభిమానం. అధికార పార్టీ చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటాడు. 
 
ఎమ్మెల్సీ కవిత పిలుపునివ్వడం ఆలస్యం.. వెంటనే రంగంలోకి దిగి ఆ కార్యక్రమం దిగ్విజయం చేసే వరకు నిద్రపోడట. కేసీఆర్ కూతురిగా కన్నా... నికార్సైన తెలంగాణ ఆడపడుచుగా ఆమె అంటే తనకు ఎంతో అభిమానమని, అక్కలా ప్రేమను పంచుతుంటారని చిన్నూ చెప్తున్నాడు. 
 
ఇవాళ కవిత పుట్టిన రోజు సందర్భంగా.. తన అభిమానాన్ని పచ్చబొట్టు రూపంలో చూపించాడు. కుడిచేతిపై 'కవితక్క' అని రాయించుకున్నాడు. ప్రస్తుతం ఇతని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

అన్నీ చూడండి

ముంబైలో శ్రీవాస్ దర్శకుడిగా ఫీనిక్స్ రాజా ఫస్ట్ పోస్టర్, 2D మోషన్ టీజర్‌ రిలీజ్

Mohabbat: మొహబ్బత్ నుంచి శ్రేయాసి సేన్ బ్యూటీఫుల్ పోస్టర్

పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన చకోర- లూనార్ లవ్ బర్డ్ మూవీ మోషన్ పోస్టర్

Vivek Athreya : రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో కొత్త సినిమా

Sharva: పల్లెటూరి కుర్రాడి గా భోగి చిత్రంలో తోబుట్టువులతో శర్వా

తర్వాతి కథనం
Show comments