సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (23:41 IST)

కరీంనగర్‌ జిల్లాలో శ్రీమతి వైఎస్‌ షర్మిల పర్యటన...

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో శ్రీమతి వైఎస్‌ షర్మిల రేపు (25–06–2021) పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు లోటస్‌పాండ్‌ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. కరోనా కారణంగా ఇటీవల మరణించిన పలు కుటుంబాలను పరామర్శిస్తారు.

చేనేత కార్మికులను కూడా కలుసుకొని వారి కష్టాలు తెలుసుకొని భరోసానివ్వనున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి అభిమానులు, ఆ కుటుంబ ఆత్మీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్‌ షర్మిల గారి పర్యటనను విజయవంతం చేయాలని మనవి.