Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

నూతన జోనల్ వ్యవస్థ- స్థానికులకే ఉద్యోగాలు.. కేటీఆర్ స్పష్టం

Written By సెల్వి
Updated: శుక్రవారం, 2 జులై 2021 (22:40 IST)
నూతన జోనల్ వ్యవస్థ ఆమోదంతో ఇక స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎలాంటి వివక్ష లేకుండా సమాన అవకాశాలు దక్కుతాయని కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95శాతం స్థానికులకే లభిస్తాయని తెలిపారు. ఇక స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
 
నూతన జోనల్ వ్యవస్థ ఆమోదించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఏపీలో ఉన్న జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిన అనంతరం.. నూతన జోనల్ వ్యవస్థ రూపుదిద్దుకుందని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయన్నారు.
 
కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కాకుండా గత ఏడేళ్లలో టీఎస్ ఐపాస్ విధానం ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేల పరిశ్రమలు రాష్ట్రం ఆకర్షించిందని కేటీఆర్ తెలిపారు. తద్వారా సుమారు 15 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో వచ్చాయన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే అవకాశాలు దక్కేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలలో ఇక్కడి యువతకు మరిన్ని ఉద్యోగాలు ఇస్తే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా మరో విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ వివరించారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments