పెళ్ళయి నెలరోజులే.. ప్రియుడి మాటలతో పడిపోయి నగలు, నగదుతో జంప్
పెళ్ళయి సరిగ్గా నెలరోజులే అవుతోంది. అంతకుముందు ప్రియుడు ఉన్నాడు. పెళ్ళయిన తరువాత కూడా అతని పరిచయం అలాగే కొనసాగింది. దీంతో అతన్ని విడిచి ఉండలేని వివాహిత ఇంట్లో నుంచి పారిపోయింది. వెళుతూ వెళుతూ ఇంట్లోని నగలు, నగదును ఎత్తుకెళ్ళింది.
హైదరాబాద్ నల్లకుంటలో నివాసముంటున్నారు నాగరాణి, సాయికుమార్‌లు. సాయికుమార్ ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. నెలరోజుల క్రితమే బాలాజీనగర్‌కు చెందిన నాగరాణితో వివాహమైంది. ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. అయితే తరచూ నాగరాణి ఇంట్లో ఫోన్లు మాట్లాడుతూ ఉండేది.
తన స్నేహితురాలు అంటూ భర్తకు చెబుతూ ఉండేది. దీంతో అతను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆమె మాట్లాడుతోంది ప్రియుడితో. పెళ్ళయిన తరువాత కూడా అతన్ని ఏమాత్రం వదులుకోలేకపోయింది. అతనికి దగ్గర అవుదామనుకుంటే భర్త ఒప్పుకోడని భావించింది.
దీంతో ఇంట్లో తన పుట్టింటి వారితో పాటు మెట్టినింటివారు పెట్టిన నగలు, 50 వేల నగదు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. సెల్ ఫోన్‌ను మరిచిపోయి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన భర్త సెల్ ఫోన్ చూసి ప్రియుడి సందేశాలను గమనించాడు. దీంతో అసలు విషయం అర్థమైంది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.