సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శుక్రవారం, 18 జూన్ 2021 (18:04 IST)

ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్, వస్తానన్న ప్రియుడు ఫోన్ తీయకపోయేసరికి...

ముగ్గురు పిల్లల తల్లి. వయస్సు కూడా 32 యేళ్ళ లోపే. అందంగా ఉంటుంది. భర్త కష్టపడి సంపాదించి భార్యాపిల్లలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. అయితే ఆమె ప్రియుడి మోజులో పడింది. పెళ్లికి ముందే ఉన్న సంబంధాన్ని కొనసాగించాలనుకుంది. భర్త కన్నా ప్రియుడే సర్వస్వంగా భావించింది.
 
సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు మండలం కందిబండకు చెందిన ముత్యాలుకు నాగరాణికి 8 యేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రొవిజన్ షాప్ యజమాని ముత్యాలు. బాగా సంపాదిస్తున్నాడు. అయితే వివాహానికి ముందే నాగరాణికి నవీన్ అనే వ్యక్తి పరిచయం ఉండింది.
 
అప్పట్లోనే అతడితో సంబంధం కొనసాగించింది నాగరాణి. పెళ్ళయిన తరువాత కూడా తరచూ నవీన్ కలిసేవాడు. అయితే ఇంట్లో ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరూ ఏకాంతంగా కలుసుకునేవారు. చాటుమాటుగా కలుసుకోవడం నవీన్‌కు ఇష్టం లేదు. నీ భర్తను చంపేద్దాం.. నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు నవీన్.
 
దీంతో భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. పిల్లలు, భర్త నిద్రిస్తున్న సమయంలో ప్రియుడు నవీన్‌కు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు నవీన్‌కు ఫోన్ చేసినా తీయకపోవడంతో నాగరాణే భర్తను అతి కిరాతకంగా చంపేసింది. దిండుతో ముఖంపై మూసి ఊపిరాడకుండా చేసి చంపేసింది.
 
అంతకుముందు అన్నంలో మత్తు మందు కలిపి భర్తను బాగా నిద్రలోకి వెళ్ళేట్లు చేసింది. అయితే తన భర్త గుండెపోటుతో మరణించాడని బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. ముత్యాలు కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టంలో నిజాలు బయటపడ్డాయి. నాగమణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.