బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 26 జులై 2021 (20:56 IST)

ప్రజలకు ఎలాంటి ఆపదా రానివ్వను: బోనాల్లో భవిష్యవాణి

అంద‌రినీ చ‌ల్ల‌గా చూస్తాన‌ని భ‌విష్య‌వాణి భ‌రోసా ఇచ్చింది. లష్కర్‌ బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

కరోనా పరిస్థితులతో గత ఏడాది సరిగా పూజలు నిర్వహించలేకపోయామని ఆలయ పూజారులు చెప్పగా, స్వర్ణలత దానికి సమాధానమిచ్చారు. ‘‘మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టినా, నన్ను నమ్మి పూజలు చేశారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేను మీ వెంట ఉండి నడిపిస్తా. అమ్మకి ఇంత చేసినా ఏం ఒరగలేదు అనొద్దు.. ప్రతి ఒక్కరినీ నేను కాచుకుంటా. ప్రజలకు ఎలాంటి ఆపదా రానివ్వను’’ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అమ్మ ప‌లుకు...ఇక ఎవ‌రికీ ఆప‌ద రానివ్వ‌ద‌ని బోనాల‌కు వ‌చ్చిన భ‌క్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంత‌కాలం క‌రోనా వ‌ల్ల పూజ‌లు చేయ‌లేక‌పోయామ‌ని ఆందోళ‌న ఉండేద‌ని, స్వర్ణలత భవిష్యవాణి విన్నాక ఆ భ‌యం పోయింద‌ని చాలా మంది బోనాల‌కు వ‌చ్చిన మ‌హిళ‌లు చెప్పుకున్నారు. తెలంగాణాలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ల‌ష్క‌ర్ బోనాల పండుగ నిర్వ‌హిస్తారు.