శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడి యువకుడి మృతి

road accident
హైదరాబాద్ నగరం గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. అమిత వేగంతో వెళుతూ డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఒకరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, వెనుక కూర్చొన్న వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు బైకులో గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై అమిత వేగంతో ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో ఒక ఫ్లైఓవర్‌ నుంచి మరో ఫ్లైఓవర్‌పై ఎగిరిపడ్డారు. ప్రమాద తీవ్రతకు మధు (25) అనే యువకుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడిని గచ్చిబౌలి నివాసిగా గుర్తించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కుక్క కరిచిన ఆరు నెలలకు ర్యాబీస్ - బాలుడి మృతి  
 
కాకినాడ జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుక్క కరిసిన ఆరు నెలలకు ర్యాబీస్ వ్యాధి సోకడంతో 17 యేళ్ల మైనర బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జిల్లాలోని గొల్లప్రోలులో వెలుగు చూసింది. ఆరు నెలల క్రితం కుక్క కరవడంతో భయపడిన బాలుడు.. విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. దీంతో ఆ బాలుడికి మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. పైగా, నీటిని చూసి భయపడిపోయాడు. దీంతో ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
జిల్లాలోని గొల్లప్రోలు గ్రామానికి చెందిన తేలు ఓంసాయి అనే 17 యేళ్ళ బాలుడిని ఆరు నెలల క్రితం కుక్క కరిచింది. ఈ విషయాన్ని అతను ఇంట్లో చెప్పలేదు. మూడు రోజుల క్రితం అతనికి తీవ్ర జ్వరం వచ్చింది. మంచినీళ్ళు కూడా తాగలేక పోయిన బాలుడు... ఆ నీటిని చూసి భయంతో వణికిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని శనివారం కాకినాడ జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ వైద్యులు పరీక్షించి, ర్యాబీస్ వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. పైగా, వ్యాధి ముదరడతో పరిస్థితి చేజారిపోయిందని వారు తెలిపారు. కాగా, కుక్కకాటుకు గురైన రోజునే యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్‌తో పాటు టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచన చేస్తున్నారు.