గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 23 జులై 2023 (09:56 IST)

బంగ్లాదేశ్‌లో విషాదం - చెరువులో పడిన బస్సు - 17 మంది మృతి

bus plunges in pond
బంగ్లాదేశ్‌లో విషాదం ఘటన జరిగింది. కొంతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది జల సమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆటోకు దారి ఇస్తుండగా, బస్సు అదుపుతప్పిన బస్సు చెరువులో పడిపోయింది. 
 
భండారియా ఉప జిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు 70 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి ఝలకతి సదర్ ఉప జిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. మృతుల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు ఉన్నారు. స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. 
 
క్షతగాత్రులతు ఝలకతి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో పరిమితికి మంచిన ప్రయాణికులను ఎక్కించుకోవడం, డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.