గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 జూన్ 2023 (17:17 IST)

21వ శతాబ్ధంలోనే అతిపెద్ద విజయం-బంగ్లాదేశ్ రికార్డు

bangladesh team
21వ శతాబ్ధంలోనే అతిపెద్ద విజయంగా కూడా బంగ్లాదేశ్ రికార్డు సృష్టించింది. బంగ్లాదేశ్ తమ టెస్టు క్రికెట్ చరిత్రలో భారీ గెలుపును నమోదు చేసుకుంది. 
 
మిర్పూర్ వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 546 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో బంగ్లాదేశ్ అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన మూడో జట్టుగా చరిత్రలోకి ఎక్కింది. 
 
అలాగే 21వ శతాబ్ధంలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. కాగా 1928లో ఆస్ట్రేలియాను 675 పరుగుల తేడాతో ఓడించడం ద్వారా ఇంగ్లండ్ టెస్టులో ఇప్పటివరకు అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 
 
అలాగే ఇంగ్లండ్‌పై ఆసీస్ 562 పరుగుల తేడాతో విజయం సాధించడం రెండో అతిపెద్ద టెస్టు విజయంగా వుండగా.. బంగ్లా ఆప్ఘనిస్థాన్‌పై 546 పరుగుల తేడాతో విజయం సాధించిన మూడో జట్టుగా నిలిచింది.