తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. వడగాలులు..
తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాల్లోని 47 మండలాల్లో వీచిన వడగాలులు జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. పది మండలాల్లో 45-46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో శని, ఆదివారాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.