చెరువులో పడబోయిన మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెరువులో పడబోయారు. అయితే తృటిలో ప్రమాదం తప్పింది.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఊరురా చెరువుల పండగలో పాల్గొన్న కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫ్ నగర్ చెరువు పండుగలో పాల్గొన్న మంత్రి ఇందులో భాగంగా ఇనుప తెప్పలో ప్రయాణించారు.
అనంతరం ఇనుప తెప్ప నుంచి దిగుతుండగా అదుపు తప్పి నీటిలో పడబోయారు. అయితే పోలీసులు అప్రమత్తమై నీటిలో పడకుండా పట్టుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది.