గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (18:42 IST)

జూలై ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు... ఎక్కడ?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలై ఒకటో తేదీ నుంచి పాఠశాలను తెరిచేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, ఆ రాష్ట్ర హైకోర్టు బ్రేక్ వేసేలా కనిపిస్తోంది. దీంతో జులై ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌లోనే పాఠశాలల తరగతులు జరుగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 
 
ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రరెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదని కేసీఆర్ అన్నారు. 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలని సూచించారు. వెంటనే ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ ఆదేశించారు. 
 
మరోవైపు, సీఎం కేసీఆర్‌ను పీఆర్టీయూ, టీఎస్ నాయకులు కలిశారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. కరోనా దృష్ట్యా పాఠశాలల పున:ప్రారంభాన్ని తాత్కాలికంగా వేయిదా వేయాలని కోరారు. 
 
రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గ‌డంతో ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల‌ను తిరిగి ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ప్రైవేటు పాఠ‌శాల‌లు తిరిగి స్కూల్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. అయితే ఎలాంటి స‌న్న‌ద్ధ‌త లేకుండా పాఠ‌శాల‌లు ఎలా ప్రారంభిస్తార‌ని హైకోర్టు ప్ర‌శ్నించిన నేప‌థ్యంలో ఇపుడు ఆన్‌లైన్ తరగతుల వైపు సర్కారు మొగ్గు చూపింది.