మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 19 మార్చి 2022 (15:05 IST)

మంత్రులకు ఫోన్ కాల్: అత్యవసరంగా మంత్రులతో కేసీఆర్ సమావేశం, ఎందుకు?

తెలంగాణ మంత్రులకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి అత్యవసర ఫోన్ కాల్ వెళ్లింది. మంత్రులను వెంటనే రావాలంటూ కేసీఆర్ తెలియజేయడంతో అంతా తమతమ కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిని అక్కడి వెళ్లారు.

 
కేసీఆర్ ఫామ్ హౌసుకు వెళ్లిన మంత్రుల్లో హరీశ్ రావు, తలసాని, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి వున్నారు. కాగా ఇద్దరుముగ్గురు మంత్రులు ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. కేటీఆర్ అమెరికా పర్యటనలో వున్న సంగతి తెలిసిందే.