ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఆగస్టు 2016 (14:49 IST)

తెలంగాణా గడ్డపై తొలిసారి అడుగుపెట్టిన మోడీ.. మిషన్ భగీరథకు శ్రీకారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర గడ్డపై తొలిసారి అడుగుపెట్టారు. ఇందుకోసం ఆయన ఆదివారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర గడ్డపై తొలిసారి అడుగుపెట్టారు. ఇందుకోసం ఆయన ఆదివారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీతోపాటు పలువురు మంత్రులు ఆయనకు పుష్ప గుచ్ఛాలు అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కడ నుంచి బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆయన మెదక్ జిల్లా గజ్వేల్‌కు వెళ్లి మిషన్ భగీరథ ప్రారంభంతోపాటు పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. 
 
కాగా, ఒక మహా సంకల్పానికి ఆదివారం శుభారంభం చేశారు. ఒక యజ్ఞంలా తెలంగాణ రాష్ట్రం చేపట్టిన మిషన్ భగీరథ తొలిదశకు ప్రారంభోత్సవం చేశారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన మిషన్ భగీరథ పథకం తొలి ఫలితం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. దేశమంతా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్న ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రారంభించారు. ఇందుకోసం ఒక చరిత్రాత్మక మహోత్సవ సంరంభానికి మెదక్ జిల్లా కోమటిబండ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ప్రధాని సభకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేశారు.
 
ప్రధాని తన పర్యటనలో కరీంనగర్ జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 1600 మెగావాట్ల థర్మల్ పవర్‌ప్లాంట్‌కు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత రామగుండంలో నిర్మిస్తున్న ఫర్టిలైజర్ ప్లాంట్‌కు, వరంగల్ జిల్లాలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి, మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేసి, అదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి 1200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు.