బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 4 ఆగస్టు 2021 (14:16 IST)

ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద టాటా సుమోలో మంటలు, తృటిలో తప్పించుకున్న పోలీసులు

పోలీసు వాహనం టాటా సుమోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఖైరతాబాద్ సిగ్నల్ వద్దకు రాగానే నడుస్తున్న వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీనితో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును నిలిపివేసి అందులో వున్న మిగిలిన పోలీసులను దించేశారు.
 
వారంతా చూస్తుండగానే వాహనం దగ్ధం అయ్యింది. అగ్నిమాపక దళానికి సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పివేసారు. ఐతే ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.