1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 4 ఆగస్టు 2021 (14:01 IST)

కర్నాటక: 29 మంది బిజెపి శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈరోజు కొత్తగా ఏర్పడిన కర్ణాటక కేబినెట్‌లో మొత్తం 29 మంది బిజెపి శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. నేడు 29 మంది మంత్రులు కర్ణాటక మంత్రివర్గంలో చేరడానికి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన చెప్పారు.
 
గతంలో యడియూరప్ప నేతృత్వంలోని కేబినెట్‌లో, ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారనీ, ఈసారి, డిప్యూటీ సీఎం ఎవరూ ఉండకూడదని హైకమాండ్ నిర్ణయించిందని బెంగళూరులో విలేకరులను ఉద్దేశించి అన్నారు.

బసవరాజ్ బొమ్మాయ్ నేతృత్వంలో కొత్తగా నియమితులైన మంత్రులు నేడు మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ ధృవీకరించింది. ఈ వేడుకను బెంగళూరులోని రాజ్ భవన్ గ్లాస్ హౌస్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేస్తారు.