గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2022 (15:24 IST)

నలుగురు భార్యలు ఉండటం ముస్లింలకు చట్టబద్ధమే : ఎంపీ అసదుద్దీన్

asaduddin
నలుగురు భార్యలు ఉండటం అసహజమన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. మీది మాత్రమే సంస్కృతా.. మాది కాదా? అని సమాధానమిస్తూనే, నలుగురు భార్యలు ఉండటం ముస్లింలకు చట్టబద్ధమే అని అన్నారు. 
 
పైగా, వారికి భరణం, ఆస్తుల్లో వాటా కూడా ఉంటాయని చెప్పారు. రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ కంటే పెద్ద హిందువు ఎవరన్న విషయంపై ఇపుడు తీవ్రమైన పోటీ నడుస్తోందంటూ ఎద్దేవా చేశారు. కాగా, నలుగురు భార్యల వ్యవహారంపై మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలను పలువురు ముస్లిం నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.