Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి ఆపివేత

Written By సెల్వి
Updated: శనివారం, 10 జులై 2021 (15:30 IST)
తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే జల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ జెన్‌కో నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసింది. నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తిని 11 రోజుల్లో తెలంగాణ జెన్‌కో 30 మిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి చేసింది. 
 
ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. ప్రాజెక్టులో నీళ్లు తక్కువగా ఉన్నప్పటికీ.. తెలంగాణ జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.
 
ఇలా చేపట్టడం వల్ల నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి వెళ్తున్నాయని కేఆర్‌ఎంబీతోపాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అయితే.. విద్యుత్‌ ఉత్పత్తిని నిబంధనల మేరకే చేపడుతున్నామని.. తమకు కేటాయించిన నీటి వాటాను వాడుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. 
 
కానీ శ్రీశైలంలో నీరు గరిష్టంగా చేరకుండా ఉండేందుకే తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని ఏపీ పేర్కొంటోంది. ఈ క్రమంలో ఏపీ రాయలసీమ ఎత్తిపోతల చేపట్టడంపై.. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేంద్రం, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments