సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 17 ఏప్రియల్ 2021 (11:02 IST)

తిరుపతి-నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఓటింగ్ ప్రారంభం

తిరుపతి ఉప ఎన్నిక ప్రారంభమైంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో 41 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరి కనిపిస్తున్నారు.
 
ఇక తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక విషయానికి వస్తే... మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో వున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వున్న 17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ అధికారులు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు.