శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 మే 2021 (18:51 IST)

తెలంగాణలో మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు..

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. 
 
తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ వరకు సముద్ర మట్టానికి 1.5-2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరిత ద్రోణి ఆవరించి ఉంది. పశ్చిమ, వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలోకి కిందస్థాయి గాలులు విస్తున్నాయి. 
 
వీటి ప్రభావంతో రానున్న మూడురోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్‌ 10 లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని పేర్కొంది.