Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏడుగురు మహిళల్ని..?

Written By ఎం
Updated: సోమవారం, 23 డిశెంబరు 2019 (08:21 IST)
ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. గతంలో అతను మరో ఏడుగురు మహిళలను అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా గుర్తించారు.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్‌ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 17వ తేదీ మంగళవారం డోకూర్‌ గ్రామ శివారులోని పంట పొలాల్లో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి హతమార్చినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అంతేకాదు,గతంలో జరిగిన ఏడు హత్యలతో అతనికి సంబంధం ఉన్నట్టు గుర్తించారు.
 
డోకూర్‌లోని కల్లు కాంపౌండ్‌లో నిత్యం మద్యం సేవించే సదరు నిందితుడు..అక్కడ కల్లు తాగేందుకు వచ్చే మహిళలతో మాట కలిపేవాడు. ఆపై వారిని తనతో తీసుకెళ్లి.. నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసి హత్య చేసేవాడు. అలా అతని చేతిలో ఇప్పటివరకు ఏడుగురు మహిళలు బలయ్యారు. దీనిపై దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు..
 
ఈ నేరాలన్నీ ఒక్కడే చేశాడా..? లేక అతనితో పాటు మరెవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

అన్నీ చూడండి

Deva Katta: వ‌ర్షాలు ప‌డితే వ‌జ్రాలు దొరుకుతాయనే కథ తో జో జో’ కాష‌న్ 1 చిత్రం

Anil Ravipudi: జనవరి 12 విడుదల చిత్రం ఊటీలో కీలక షెడ్యూల్ ప్రారంభం

AA 23 Update : అల్లు అర్జున్ తో లోకేష్ కనకరాజు చిత్రం : మైత్రీ మూవీ మేకర్స్

Pawan Kalyan's 30-years: పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు సినీ ప్రయాణంపై అల్లు అరవింద్ ప్రశంసలు

సుమ బాటలో విహారి ఓటిటి యాప్ ప్రోమో కు హోస్ట్ గా యాంకర్ శ్రీ సత్య

తర్వాతి కథనం
Show comments