శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (14:17 IST)

వైయస్ రాజశేఖరరెడ్డిపై వీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏంటంటే?

దివంగత వైయస్ రాజశేఖరరెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీహెచ్ చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. పీజేఆర్, తనకు మధ్య ఉన్న బంధాన్ని విడదీయాలని వైయస్ అప్పట్లో ప్రయత్నించారని వీహెచ్ అన్నారు. పీజేఆర్‌కు దూరమైతే ఎలాంటి సహాయం అయినా చేస్తానని వైయస్ తనకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అయితే, తాను ఆ ఆఫర్ ను తిరస్కరించానని అన్నారు. వైయస్ ఇచ్చిన ఆఫర్ ను తాను అంగీకరించి ఉంటే ఎంతో సంపాదించేవాడినని చెప్పారు.
 
తెలంగాణ కోసం పోరాడిన తొలి వ్యక్తి పీజేఆర్ అని వీహెచ్ కొనియాడారు. ఎంతో మంది పేదలకు ఇళ్లు ఇప్పించారని, తాగునీటి కోసం పోరాటం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం పీజీఆర్‌ను ప్రజలు మరువరని చెప్పారు. 
 
మరోవైపు రేవంత్ రెడ్డి అభిమానుల పేరుతో వీహెచ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ... తన అభిమానులను రేవంత్ రెడ్డి ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన అభిమానులపై రేవంత్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.