మారువేషంలో రేవంత్ రెడ్డి: గోడదూకి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి జంప్
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ట్రిపుల్ ఐటీ మెయిన్ గేట్ దగ్గర భారీగా బలగాలను మోహరించారు. క్యాంపస్‌కు చాలా దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారు.
బాసరకు వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులను మోహరించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసే అనుమతి ఇచ్చారు. రాజకీయ నాయకులెవరు బాసరలోకి ఎంట్రీ ఇవ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.
పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపించారు. పోలీసుల కళ్లుగప్పి బాసర ట్రిపుల్ ఐటీకి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. కాలి నడకన వచ్చి గోడ దూకి క్యాంపస్‌లోకి ప్రవేశించారు రేవంత్ రెడ్డి.
అక్కడే ఉన్న పోలీసులు రేవంత్‌ని అదుపులోకి తీసుకున్నారు. బాసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి మరో వాహనంతో రేవంత్ రెడ్డిని హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు.
వందలాది మంది పోలీసుల పహారా ఉన్న రేవంత్ రెడ్డి బాసర క్యాంపస్ వరకు ఎలా వచ్చారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో క్యాంపస్ పరిసరాల్లో భద్రత మరింత పెంచారు పోలీసులు.