సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (14:48 IST)

మా సభకు పవర్ కట్ చేస్తే.. త్వరలోనే ప్రజలు మీ పవర్ కట్ చేస్తారు..!

ఇటీవల తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజ సీఎం మాయవతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీలో (బీఎస్పీ)లో చేరారు. ఆ తర్వాత ఆయన క్రియాశీలకంగా మారారు. ముఖ్యంగా తెలంగాణాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన మూడు సభల్లో ప్రసంగించారు. తాను ప్రసంగం ఇస్తున్నప్పుడే విద్యుత్ నిలిచిపోయిందని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 
 
అలాగే తనతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా పెడుత్తున్నారని... దాని గురించి అందరికీ తెలుసన్నారు. తమ శ్రమను దోపిడీ చేసి కట్టుకున్న రాజప్రసాదాలకు... తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. 
 
26 ఏళ్లు ఐపీఎస్​ అధికారిగా సేవలు అందించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ ఇటీవల స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఇంకా ఆరు ఏళ్ల సర్వీస్​ ఉన్నప్పటికీ... ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.