శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 నవంబరు 2022 (15:25 IST)

వచ్చే నెలలో ఎస్ఐ - కానిస్టేబుల్ ఉద్యోగాలకు దేహదారుఢ్య పరీక్షలు

tspolice
తెలంగాణ పోలీసు నియామక పరీక్షల కోసం నిరుద్యోగ అభ్యర్థుల నిరీక్షణకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల పోస్టులకు శారీరక దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆదివారం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
డిసెంబరు 8వ తేదీ నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ శారీరక దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొంది. డిసెంబరు 8వ తేదీన నుంచి పీఎంటీ, పీఈటీ టెస్టులు నిర్వహిస్తామని తెలిపింది. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 29వ తేదీ ఉదయం 8 గంటల నుంచి డిసెంబరు 3వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌తో సహా మొత్తం 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. 
 
ఈవెంట్స్‍ను డిసెంబరు 8వ తేదీ నుంచి ప్రారంభించి 25 రోజుల్లో పూర్తి చేస్తామని పెర్కొంది. పూర్తి వివరాల కోసం https://www.tslprb.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురైతే [email protected] కి మెయిల్ లేదా 93937 11110, 93910 05006 అనే నంబర్లకు ఫోన్ చేయొచ్చని తెలిపింది.