Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులు నిల్... రద్దవుతున్న రైళ్లు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 14 మే 2021 (10:44 IST)
దేశంలో కరోనా వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడ్డారు. వీటితో పాటు.. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి. వీటితో పాటు ఇతర ఆంక్షల కారణంగా చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటుండడంతో రైళ్లు బోసిపోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ మీదుగా ప్రయాణించే ఆరు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నిన్న తాత్కాలికంగా రద్దు చేసింది. విశాఖపట్టణం-కడప (07488) రైలును నేటి నుంచి ఈ నెల 31 వరకు రద్దు చేయగా, కడప-విశాఖ రైలు (07487)ను రేపటి నుంచి జూన్ 1 వరకు రద్దు చేసింది. 
 
అలాగే, విశాఖ-లింగంపల్లి (02831), లింగంపల్లి-విశాఖ (02832) రైళ్లను రేపటి నుంచి వచ్చే నెల 1 వరకు నిలిపివేసింది. ముంబై సీఎస్‌టీ-ఆదిలాబాద్ (01141) ఎక్స్‌ప్రెస్‌ను 17వ తేదీ నుంచి, ఆదిలాబాద్-ముంబై సీఎస్‌టీ (01142) రైలును 18 నుంచి రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ రైళ్లను తిరిగి ఎప్పటి నుంచి పునరుద్ధరించేదీ వెల్లడించలేదు.

అన్నీ చూడండి

Anand Devarakonda: ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నాలుగో పాటగా ‘సబ్‌కో’ విడుదల

రాజ‌మౌళి నిర్మాణంలో ఫాంటసీ చిత్రం డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ డేట్ ఫిక్స్

Sprit: హైదరాబాద్ లో ప్రభాస్ చిత్రం స్పిరిట్ షూట్ కు కారణం చెప్పిన నిర్మాత

మారిన ప్రేక్షకుల ట్రెండ్ అండ్ మూడ్ - హీరో ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఫస్ట్ : రానా దగ్గుబాటి

Suri: నన్ను ఘోరంగా అవమానించి, నా చొక్కా విప్పేసి వేరే వ్యక్తికి ఇచ్చారు : సూరి

తర్వాతి కథనం
Show comments